ఆగష్టు 15 ,1947
మీ శివ
ఆగష్టు 15 భారతీయులకు లభించిన స్వాతంత్ర్యం
150 సంవత్సరాల పోరాట ఫలితం
ఆ క్షణం భారతీయులు పొందిన ఆనందం
ప్రపంచ దేశాలను జయించినంతటి సంతోషం
ఆంగ్లేయుల పాలనకు స్వస్థి పలికిన రోజు
అరాచకాలు, మారణకాండలు ముగిసిన రోజు
స్వపరిపాలనకు శ్రీకారం జరిగిన రోజు
ప్రజాస్వామ్యం పుట్టిన రోజు
స్వాతంత్ర్యం సాధించి ఇప్పటికి అరవై ఏళ్లు
కాని దేశాభివృధ్ధి ఎన్ని పాల్లు
ఇంకా అభివృధ్ధి చెందుతూఉండటం ఎన్ని నాళ్లు
కదలండి దేశాభివృధ్ధికి పాటుపడండి కనీసం కొన్ని నాళ్లు
ఏ భారతీయుడి జీవితంలో ఉండకూడదు కన్నీళ్లు
ఆనాడె మనం పొందిన ఈ స్వాతంత్ర్యానికి అర్థవంతమైన రోజు
No comments:
Post a Comment