October 2 అనగానె మీకందరికి గుర్తుకువచ్చేది ఎమిటి,ఇంకేముంది జాతి పిత గాంధీ గారి పుట్టిన రోజు.కాని చాల మందికి తెలియనది ఎమిటంటె ఆ రోజె ఒక మహోన్నత వ్యక్తి పుట్టాడు.
చదువుకోవడానికి నది దాటాల్సివచ్చినా, నావకు చెల్లించాల్సిన అణా కూడ లేకున్న,నదిని ఈదుకుంటూ వెల్లి చదువుకున్నాడు.అంతటి దారిద్ర్యంలో పుట్టినప్పటికి,చదివి భారతదేశ మంత్రివర్గంలో రైల్వె మంత్రిగ ఉండి ,ఆ సమయంలో తన పిల్లలను సైతం ప్రభుత్వకారును ఉపయొగించకుండా చేసిన నిజాయితి పరుడు,ఆ తరువాత 2 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి పుట్టింది కూడ ఆ రోజే.
ఆయనే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు.మన రాజకీయనాయకులందరూ ఆయనను అదర్శంగా తీసుంటే మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన 20 ఏళ్ల లొనే అభివృధ్ధి చెందిన దేశంగా ఎదిగేది.ఆయన నిజాయితికి నిదర్శనం ఒకసారి రైలు ప్రమాదం జరిగినప్పుడు దానికి బాద్య్డని తెలియగానె రైల్వెమంత్రిగా రాజినామ చేసిన ఏకైక రాజకీయనాయకుడు ఆయన.
దేశ ప్రదానమంత్రిగా 2 ఏళ్లు పనిచేసినా కనీసం ఒక చిన్న ఇల్లు కూడ కట్టుకోని గొప్ప నిస్వార్థపరుడు ఆయన.భారత దేశం పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాలు అభివృధ్ధి జరగాలంటె ఈ స్వార్థ రాజకీయాలకు స్వస్థి చెప్పండి .బ్రతికున్న కొంత కాలంలొ ఈ దేశం కోసం ,దేశ ప్రజల కోసం ఎదొ ఒక మంచి చేద్దాం.ఇకనుంచి ఎవరైన రాజకీయనాయకుడు అవ్వాలనుకుంటె ముందు శాస్త్రి గారి గురించితెలుసుకొని ఆయన బాటలొనే నడవండి.ఎప్పుడూ మీదే విజయం.
మిత్రులార ఇకనుంచి October 2 అనగానె గాంధి గారితో పాటు శాస్త్రి గారిని కూడ గుర్థుకు తెచ్చుకోండి నిస్వార్థంగా సేవ చేయండి.
మీ శివ